epaper
Wednesday, February 18, 2026
epaper

నాని “ది ప్యారడైజ్” మూవీ బిగ్ అప్డేట్

కలం, సినిమా : న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ది ప్యారడైజ్”(The Paradise) . టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఎస్ఎల్‌వి సినిమాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను (The Paradise) ఆగష్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ నుంచి “ఆయా షేర్” అనే ఫస్ట్ సింగల్ ఈ నెల 24 న హీరో నాని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనిరుధ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ తో ఈ సాంగ్ అదిరిపోనుందని సమాచారం.

Read Also: విజయ్-రష్మిక పెళ్లి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న జంట!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>