కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడంపై వస్తున్న విమర్శలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) వివరణ ఇచ్చారు. సొంత పార్టీ కార్యకర్తలతో పాటు వివిధ వర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ అంశంపై స్పందించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాల మేరకే తాను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో (Isnapur Municipality) బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేశానని రఘునందన్ రావు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తనపై పోటీ చేసిన నీలం మధు భార్య కవిత ఈ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనే ఉద్దేశంతో, బీఆర్ఎస్ నాయకుడు గూడెం మహిపాల్ రెడ్డి తనను సంప్రదించారని రఘునందన్ రావు (Raghunandan Rao) వివరించారు. దీనిలో భాగంగానే తాను బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Read Also: తండ్రికి కవిత విషెస్.. అప్పుడలా.. ఇప్పుడిలా
Follow Us On: X(Twitter)


