epaper
Wednesday, February 18, 2026
epaper

తండ్రికి కవిత విషెస్.. అప్పుడలా.. ఇప్పుడిలా

కలం, తెలంగాణ బ్యూరో : “తెలంగాణకు నీ జననం ఓ వరం.., విముక్తి కోసం వీరుడు ఉదయించిన తరుణం.., వ్యక్తి కాదు.. ఓ శక్తి.., నన్ను నడిపించిన తొలి నేస్తం.., నన్ను తీర్చిదిద్దిన తొలి గురువు.., నా జీవితానికి తొలి హీరో.., నా పోరాటానికి ఉద్యమ స్ఫూర్తి..” ఇదీ తండ్రి కేసీఆర్ గురించి ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత గర్వంగా చెప్పుకునే మాటలు. ప్రతి ఏటా ఫిబ్రవరి 17న తండ్రి పుట్టినరోజు (KCR Birthday) సందర్భంగా ఇలాంటి జ్ఞాపకాలతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేవారు. కష్టకాలంలో సైతం ఆందోళనకు గురికాకుండా తండ్రిని తల్చుకుంటూ ఉంటానని గుర్తుచేసేవారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ సందర్భంగా అరెస్టయినప్పుడు కూడా ఆమె “ఐ యామ్ ది డాటర్ ఆఫ్ ఫైటర్” అని గర్వంగా చెప్పుకున్నారు.. అయితే ఇదంతా గతం. కవిత లాగానే కేటీఆర్ సైతం తండ్రి కేసీఆర్‌ను ‘నిరంతర స్ఫూర్తి’ అంటూ వ్యాఖ్యానించేవారు.

2024

ఏడాదిలో కవితలో ఎంత మార్పు !

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత కొత్త రాజకీయ వేదిక ఏర్పాటులో కవిత (Kavitha) తలమునకలయ్యారు. పార్టీతో బంధం తెగిపోయిన తర్వాత తల్లిదండ్రులతోనూ ఆమె దూరంగానే ఉంటున్నారు. తోడబుట్టిన అన్న కేటీఆర్‌పైనా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలోని వైఫల్యలనూ ఎత్తిచూపుతున్నారు. స్వరాష్ట్రం ఏర్పడినా ప్రజలు ఆశించిన ఫలితం కేసీఆర్ పాలనలో సంపూర్ణంగా అందలేదని, అందుకు నిదర్శనమే అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని ఆయన విస్మరించడం అంటూ ఇటీవల కామెంట్ చేశారు. ప్రతి ఏటా తండ్రి కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న స్వయంగా ఆయన దగ్గరకు వెళ్ళి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకోవడం ఆమెకు ఆనవాయితీ. కానీ ఈసారి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురికావడంతో పలకరింపుల్లేవ్.. పరామర్శల్లేవ్. ట్వీట్‌తోనే సరి.

2025

గతంలోని జ్ఞాపకాల్లేని బర్త్ డే విషెస్ :

గడచిన ఐదేండ్లుగా తండ్రికి బర్త్ డే విషెస్ (KCR Birthday) చెప్పిన కల్వకుంట్ల కవిత ట్వీట్‌లను చూస్తే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమెలో వచ్చిన మార్పు స్పష్టమవుతుంది. “ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావ్‌ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ ద్వారా విషెస్ తెలిపారు. పాతకాలం జ్ఞాపకాలను పంచుకోవడం, ఫోటో పెట్టకపోవడం, ‘తండ్రి’ అని సంబోధించకపోవడం.. వీటన్నింటిపైనా నెటిజెన్ సెటైర్లు వేశారు. “పదవి లేకపోతే తండ్రి ఫోటో కూడా ఉండదు.., రక్తసంబంధం కన్నా రాజకీయాలే ఎక్కువా?.., గొప్ప కూతురు అనిపించుకున్నావ్ అక్కా…, ఇంతటి పేరు తీసుకొచ్చిన తండ్రిని నాన్నా.. అని రాయడానికి కూడా చేతులు రాలేదా?.., ఏదో ఒక ట్వీట్ మొహాన పడేద్దాం.. అన్నట్లు ఉన్నది..” అంటూ కవిత ట్వీట్‌కు రియాక్షన్లు వచ్చాయి.

2026

 

Read Also: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>