Mobile Popup Ad
Mobile Popup Ad

పాక్ జట్టుకు షెల్టర్ కష్టాలు.. ఆస్ట్రేలియాలో అవస్థలు

కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా టూర్‌లో పాక్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఉండటానికి వసతులు లేక పాకిస్థాన్ (Pakistan)  హాకీ జట్టు నానా తిప్పలు పడుతోంది. చివరి మ్యాచ్‌కు ముందు రోజు హోబార్ట్‌లో ముందే బుక్ చేసిన రూమ్స్‌ను టైమ్ కన్నా ముందే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల చెక్‌అవుట్‌కు ముందే ఆటగాళ్లు సామాన్లు సర్దుకున్నారు. ఆ దృశ్యాలు వీడియోలుగా బయటకు వచ్చాయి. ఏడు రోజుల వసతికి చెల్లింపులు చేసినా, జట్టును నగరానికి గంటన్నర దూరంలోని కనీస సౌకర్యాలున్న ప్రాంతంలో ఉంచారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

టూర్‌లో వచ్చిన లాజిస్టికల్ సమస్యలే దీనికి కారణమని సమాచారం. తర్వాత స్థానిక కమ్యూనిటీ సహకారంతో ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటు చేశారు. భోజన సమస్య కూడా అక్కడే పరిష్కరించారు. మొదట హోటల్ (Hotel) బుకింగ్స్ రద్దయ్యాయని, ఆన్‌లైన్ ద్వారా మళ్లీ గదులు తీసుకున్నప్పటికీ ఒక్కో గదిలో నలుగురు నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఉండాల్సి వచ్చిందని తెలిసింది. ఆ బుకింగ్స్ మొత్తం స్టే చేయడానికి సరిపోలేదు.

మైదానంలోనూ నిరాశే ఎదురైంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ ఆస్ట్రేలియా (Australia)  లెగ్‌లో పాక్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆతిథ్య ఆస్ట్రేలియా, జర్మనీ చేతుల్లో వరుస ఓటములు ఎదురయ్యాయి. ఇక ముందున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 13న బెల్జియం, జూన్ 14న స్పెయిన్‌లో మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత ఇండియా, ఇంగ్లండ్‌తో కీలక పోటీలు జరగనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>