epaper
Wednesday, February 18, 2026
epaper

రషీద్ రికార్డ్.. టీ20ల్లో ఇదే ఫస్ట్ టైమ్..

కలం, వెబ్​ డెస్క్​ : అఫ్ఘానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ (Rashid Khan) అరుదైన రికార్డ్ సాధించాడు. టీ20ల్లో 700 వికెట్లు మైలురాయిని అందుకున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ రికార్డ్ సృష్టించాడు. టీ20ల్లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్‌లో యూఏఈ దిగువ క్రమ బ్యాటర్ మహమ్మద్ అర్ఫాన్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. అదే రషీద్ ఖాన్ (Rashid Khan) 700వ వికెట్‌గా నమోదైంది. ఇంతకుముందే, 2025 ఫిబ్రవరిలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 631 వికెట్ల రికార్డును రషీద్ దాటేశాడు. ప్రస్తుతం యాక్టివ్ క్రికెటర్లలో సునీల్​ నరైన్, ఇమ్రాన్ తాహిర్ కూడా టాప్ వికెట్ టేకర్ల జాబితాలో ఉన్నారు.

టీ20 క్రికెట్ మొత్తంగా చూస్తే, రషీద్ ఖాన్ 518 మ్యాచ్‌ల్లో 700 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం 114 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు సాధించి, త్వరలోనే 200 వికెట్ల క్లబ్‌లో చేరే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన టీజీ సౌతీ, ఐఎస్ సోది, బంగ్లాదేశ్ స్టార్‌లు షాకిబ్ అల్ హసన్, ముస్తఫిజుర్ రహ్మాన్ కూడా ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే… టీ20ల్లో అత్యధికంగా నాలుగు హ్యాట్రిక్స్ తీసిన ఘనత కూడా రషీద్ పేరుపైనే ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>