epaper
Wednesday, February 18, 2026
epaper

డిజిటల్​ పేమెంట్స్ వర్సెస్​ క్యాష్​ ట్రాన్సాక్షన్స్​​.. దేశంలో భారీగా నగదు చెల్లింపులు..

కలం, వెబ్​ డెస్క్​ : దేశంలో డిజిటల్​ పేమెంట్స్​ మొదలయిన నాటి నుంచి చాలా మంది యూపీఐ (యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ ఫేస్​) చెల్లింపులపైనే ఆధారపడ్డారు. ప్రతి చిన్న వాటికి యూపీఐ ఉపయోగిస్తున్నారు. అయితే, డిజిటల్​ చెల్లింపుల హవా నడుస్తున్నా నగదు చలామణి కూడా అదే స్థాయిలో పెరుగుతోందని తాజా ఎస్బీఐ రిసెర్చ్​ నివేదిక (SBI Report) వెల్లడించింది. యూపీఐ పేమెంట్స్​ రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ నగదు చెల్లింపులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఎస్బీఐ రిపోర్ట్ (SBI Report)​ ప్రకారం.. జనవరి నెలలో రూ.40 కోట్ల నగదు చేతులు మారినట్లు పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 11.1 శాతం ఎక్కువగా ఉంది. నగదు చలామణిలో 97.6 శాతం ప్రజల వద్దే ఉన్నట్లు రిపోర్ట్​ వెల్లడించింది. నెలకు రూ.40 లక్షల కంటే ఎక్కువ యూపీఐ ట్నాన్షాక్షన్స్​ జరిపితే జీఎస్టీ నోటీసులు, ఇన్​ కమ్​ ట్యాక్స్ భయాలతో నగదు చెలామణి పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెరుగుతున్న నోట్ల వినియోగం..!

డిజిటల్​ చెల్లింపులు వచ్చిన తరువాత నోట్ల వినియోగం తగ్గిపోయింది. అయితే, ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో రూ. 100, రూ.200 నోట్ల వినియోగం అధికమవుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో వాణిజ్య పన్నుల శాఖ చిన్న వ్యాపారులు, విక్రేతలకు భారీగా జీఎస్​టీ నోటీసులు జారీ చేయడంతో వారు డిజిటల్​ చెల్లింపుల నుంచి నగద బదిలీలకు మళ్లారు. అలాగే, బంగారం, వెండి ధరలు పెరగడం కూడా మార్కెట్ల లో నగదు బదిలీలు పెరగానికి ఒక కారణమని నివేదిక ద్వారా తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>