కలం, డెస్క్ : తెలంగాణలో హంగ్ వచ్చి ఇంకా చైర్మన్ ఎన్నికలు కాని 8 పట్టణాలపై బీఆర్ ఎస్ ఫోకస్ చేసింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) 8 పట్టణాలకు ఇన్ ఛార్జులను నియమించారు. అక్కడి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని సూచించారు. స్థానిక నాయకత్వానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి బలం ఉన్నందున.. చైర్మన్ స్థానాలను గెలుచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను అడ్డుకునేందుకు.. మీకు అండగా ఉండేందుకు సీనియర్ లీడర్లను పంపుతున్నామని.. వారితో అన్ని విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ (KTR) సూచించారు. దీంతో ఇన్ ఛార్జులు ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు.
ఇన్ ఛార్జులు వీరే..
తొర్రూర్ : ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్డి
జనగామ : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
క్యాతనపల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
కాగజ్ నగర్ : మాజీ మంత్రి జోగురామన్న
జహీరాబాద్ : ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునితా లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.


