కలం, స్పోర్ట్స్ : ఇండియా-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ ఇప్పుడు పెద్ద పోటీగా చూడాల్సిన అవసరం లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) తాజా వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఉన్న ఉత్కంఠ ఇప్పుడు కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇండియా-ఆస్ట్రేలియా, ఇండియా-దక్షిణాఫ్రికా, ఇండియా-ఇంగ్లండ్ పోటీలే నిజమైన పెద్ద మ్యాచ్‌లని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ జట్టును ఇప్పటికీ జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, సయీద్ అన్వర్ వంటి దిగ్గజాల జట్టుగా ఊహించడం పొరపాటని గంగూలీ చెప్పారు.
ఆ తరహా పాకిస్థాన్ ఇప్పుడు లేదని ఆయన పేర్కొన్నారు. గత కాలంలోని మ్యాచ్‌లే నిజమైన పెద్ద పోరులని గుర్తుచేశారు. ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య నాణ్యతలో స్పష్టమైన తేడా ఉందని ఆయన సూచించారు. ఫలితం ఎలా వస్తుందన్నదానికంటే జట్ల సామర్థ్యంలో ఉన్న వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. రెండు జట్ల మధ్య స్థాయి వ్యత్యాసం కారణంగానే మ్యాచ్‌ల ఉత్కంఠ తగ్గిందని భావన వ్యక్తమైంది.
ఒకప్పుడు ఈ పోటీకి ప్రత్యేక స్థానం ఉండేదని క్రికెట్ వర్గాలు చెబుతుంటాయి. రాజకీయ, క్రీడా నేపథ్యాలు ఈ మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేవి. అయితే కాలానుగుణ మార్పులతో పరిస్థితులు మారాయని గంగూలీ (Sourav Ganguly) వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Read Also: హాజెల్‌వుడ్ ఔట్.. స్మిత్ ఆస్ట్రేలియా జట్టులోకి
Follow Us On: Pinterest


