epaper
Wednesday, February 18, 2026
epaper

ఉండవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన బిల్‌గేట్స్

కలం, డెస్క్ : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ (Bill Gates) సోమవారం ఏపీలో పర్యటించారు. బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ ఉండవల్లి (Undavalli) ప్రాంతాన్ని సందర్శించి.. అక్కడి అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని ఎలా వాడుతున్నామనేది సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం, టెక్నాలజీ అవసరాలను కూడా వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు.

మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది..

సీఎం చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ (Bill Gates) ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు. మన రైతులను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. ‘టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ముందు నుంచి వాడుతున్నది మన వాళ్లే. ఈ విషయాన్ని బిల్ గేట్స్ కు వివరించాం. ఆయనకు సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికి.. డ్రోన్ల వినియోగాన్ని వివరించాం. ఏపీలో నూతన పంట పద్ధతులు, ధరలు, నేల పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఏఐ సలహాలు పాటిస్తూ సహజమైన వ్యవసాయ పంటలను పండిస్తున్నాం’ అంటూ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.

Read Also: ఇండియా-పాక్ పెద్ద మ్యాచ్ కాదు : గంగూలీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>