దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అమోనియం నైట్రేట్ అమ్మకాలపై రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(LG Saxena) ఫోకస్ పెట్టారు. నిర్ణీత పరిమితికి మించి జరిగే ప్రతి క్రయవిక్రయాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎల్‌జీ.. ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ చీఫ్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు(Delhi Blast) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు చర్యలు, ఇటువంటి ఘటనలు పునరావృత్థం కాకుండా నివారణ చర్యలను అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
ఇందులో భాగంగానే తీవ్రవాద భావజాల కంటెంట్‌పై శాస్త్రీయ ట్రాకింగ్ నిర్వహించాలని తెలిపారు. అలాగే వైద్య అధికారులు, సిబ్బందిపై ఒక సెంట్ర్ డేటా నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. భద్రతను పెంచాలని, అనుమానితులపై నిఘా ఉంచాలని LG Saxena పేర్కొన్నారు.
Read Also: దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన భారత్ తేజస్..
Follow Us on : Pinterest


