epaper
Wednesday, February 18, 2026
epaper

రసాభాసగా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

కలం, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా చౌటుప్పల్  మున్సిపాలిటీ (Choutuppal Municipality) చైర్మన్ ఎన్నికల్లో భాగంగా రసాభాస నెలకొంది. 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని అలిగి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించడంతో ఆమె మద్దతుదారులు వాణికి చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మెన్‌గా మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్‌గా గోశిక వినయ్‌ని కౌన్సిల్ సభ్యుల సహకారంతో నియమించారు.

అనంతరం ఎంఎల్ఏ రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మాట్లాడుతూ తను నమ్ముకొని పార్టీలోకి వచ్చినటువంటి బత్తుల వాణి విప్లవ్ కూడా చైర్మన్ (Choutuppal Chairman) పదవికి అర్హులేనని కానీ మోగుదాల పావని రమేష్ గత 20 సంవత్సరాలుగా తన వెంటే ఉండి చాలాసార్లు టికెట్ కోల్పోయిన కూడా పార్టీ కోసం పని చేశారని అందుకే చైర్మన్‌గా ప్రకటించడం జరిగిందని అన్నారు. బత్తుల వాణి విప్లవ్‌కు కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని అదేవిధంగా వారికి ఎల్లప్పుడూ తన సపోర్ట్ ఉంటుందని అన్నారు.

Read Also: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>