Mobile Popup Ad
Mobile Popup Ad

న్యాయవాది స్వప్న హత్యకేసు.. డీజీపీ నివేదిక కోరిన హెచ్ఆర్​సీ

కలం, వెబ్​ డెస్ : న్యాయవాది స్వప్న కుమారి (Lawyer Swapna Kumari) హత్యపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ స్పందించింది. హత్య కేసు (Murder Case) లో పోలీసుల నిర్లక్ష్యంపై హెచ్ఆర్సీ డీజీపీ నుంచి నివేదిక కోరింది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్​ మండలం కేతిరెడ్డి పల్లిలో న్యాయవాది స్వప్నని భూవివాదాల కారణంగా దారుణంగా హత్య చేసిన విషయం తెలిసింది. చేవెళ్ల పరిధిలో జరిగిన భూవివాదం నివారించడంలో మొయినాబాద్​ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారంటూ 163 మంది న్యాయవాదులు ఫిర్యాదు చేయగా జస్టిస్​ షమీమ్ అక్తర్​ అధ్యక్షతన మానవ హక్కుల సంఘం నేడు విచారణ చేపట్టింది.

మృతురాలు (Lawyer Swapna) తన సోదరుడిని నిందితుడిగా పేర్కొంటూ ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు తెలిపారని, దీనిపై పోలీసులు సకాలంలో స్పందించడంలో విఫలమయ్యారని ఫిర్యాదుదారులో ఆరోపించారు. ఇది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించాల్సిన విషయమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వప్న హత్య కేసు (Murder Case)కు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారి చేసింది. మార్చి 6వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Read Also: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>