రేపటి నుంచి బోర్డు పరీక్షలు.. సీబీఎస్​ఈ కీలక అప్​డేట్​

కలం, వెబ్​డెస్క్​: రేపటి నుంచి పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(CBSE) సోమవారం కీలక అప్​డేట్​ ఇచ్చింది. పదవ తరగతి విద్యార్థులందరూ మొదటి బోర్డు పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. వీటిలో కనీసం మూడు సబ్జెక్టుల పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను ‘ఎసెన్షియల్​ రిపీట్​’ కేటగిరీలో చేర్చుతామని వెల్లడించింది.

సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల మొదటి బోర్డు పరీక్షకు హాజరుకాలేమని, రెండో విడత పరీక్షకు అనుమతి ఇవ్వాలని కొంత మంది 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్​ఈని కోరారు. ఈ నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చినట్లు బోర్డు తెలిపింది.

‘10వ తరగతి విద్యార్థులందరూ మొదటి బోర్డు పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి. వీటిలో పాసైన, అర్హత పొందిన వాళ్లు సైన్స్, గణితం, సోషల్ సైన్స్​లో ఏ మూడు సబ్జెక్టుల్లోనైనా తమ ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది’ అని సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షల అధికారి సన్యామ్​ భరద్వాజ్​ తెలిపారు. అలాగే, ‘మొదటి బోర్డు పరీక్షల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరుకాని విద్యార్థులను రెండో విడత పరీక్షకు అనుమతించం. అలాంటి విద్యార్థులు ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీలోకి వెళ్తారు. వాళ్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ప్రధాన పరీక్షలకు మాత్రమే హాజరుకావచ్చు’ అని ఆయన వెల్లడించారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రేపటి నుంచి మార్చి 7 వరకు జరుగుతాయి.

కాగా, సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 9 వరకు జరుగనున్నాయి. వీటిని రెండు షిఫ్టుల్లో నిర్వస్తారు. వీటికి సంబంధించిన ముఖ్యమైన పేపర్ల తేదీలను బోర్డు త్వరలో ప్రకటించనుంది. మరిన్ని వివరాలు https://www.cbse.gov.in/ వెబ్​సైట్​లో తెలుసుకోవచ్చు.

Read Also: జేఈఈ మెయిన్​ ఫైనల్ కీ రిలీజ్​.. 9 ప్రశ్నలు ఔట్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>