కలం, ఖమ్మం బ్యూరో: మధిర మున్సిపాలిటీ (Madhira Municipality)లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. చైర్‌పర్సన్ (Chairperson)గా సామినేని సుజాత, వైస్ చైర్మన్‌గా కోన ధనికుమార్ ఎన్నికయ్యారు. సోమవారం మధిర ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భట్టి విక్రమార్క వ్యూహాత్మక చర్యలతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అభ్యర్థుల ఎంపికలో సమన్వయం, స్థానిక స్థాయిలో విస్తృత చర్చలు జరపడం వంటి చర్యలతో అనుకున్న ఫలితాలు వచ్చాయి.
Read Also: కొత్తగూడెం కార్పొరేషన్ పీఠంపై గిరిజన బిడ్డ
Follow Us On: Instagram


