epaper
Wednesday, February 18, 2026
epaper

కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం

కలం, వెబ్ డెస్క్: తీవ్ర ఉత్కంఠ రేపిన కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ (Karimnagar Mayor)  పదవిని చివరకు బీజేపీ కైవసం చేసుకున్నది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ పదవికి కావాల్సిన పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో ఈ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. ఈ స్థానాన్ని తామే కైవసం చేసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం.. క్యాంప్ రాజకీయాలకు తెర లేపడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.

మొత్తం 66 స్థానాలున్న కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ 30 గెలిచింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 10, ఎంఐఎం మూడు స్థానాల్లో గెలుపొందారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 34 ఏ పార్టీకి దక్కలేదు. ఇండిపెండెండ్ల మద్దతుతో మేయర్ (Karimnagar Mayor) పదవిని బీజేపీ కైవసం చేసుకున్నది. సోమవారం జరిగిన మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నది.

బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) 34 ఓట్లు సాధించి మేయర్ పదవిని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ వారి వ్యూహాలు ఫలించలేదు. కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకోవడంలో వ్యూహం రచించారు.

Read Also: విజయ్, రష్మిక రిసెప్షన్ హైదరాబాద్ లో ఎక్కడంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>