epaper
Wednesday, February 18, 2026
epaper

పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

కలం, వరంగల్ బ్యూరో: పరకాల పురపాలక సంఘం (Parakala Municipality) చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్ (Pavushetti Sunil Kumar) ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు హాజరై అభినందనలు తెలిపారు.

పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా పారదర్శక పాలన అందిస్తానని సునీల్ కుమార్ పేర్కొన్నారు. పరకాల పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో పరకాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

Read Also: పెళ్లిబాజాలకు వేళాయే.. ముహూర్తాలు ఎలా ఉన్నాయంటే!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>