కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్ (Rajasthan)లోని ఖైరథల్ తిజారా జిల్లాలో ఉన్న పారిశ్రామిక నగరం భివాడీ (Bhiwadi)లో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఖుష్ఖెడా పరిశ్రమల ప్రాంతంలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 11 మంది కార్మికులు పని చేస్తుండగా, మంటలు చెలరేగిన వెంటనే కొందరు బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.
అయితే మరికొందరు లోపలే చిక్కుకున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీ కొంతకాలంగా మూసివేసి ఉన్నప్పటికీ, ఇటీవల కొన్ని పనుల కోసం తెరిచినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Read Also: గుజరాత్లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు!
Follow Us On: X(Twitter)


