కలం, ఖమ్మం బ్యూరో: నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం (Kothagudem) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని గిరిజన బిడ్డ అధిరోహించారు. సుజాత నగర్ 20వ డివిజన్ నుంచి సీపీఐ తరుఫున విజయం సాధించిన మూడ్ గణేష్ మేయర్గా ఎన్నికయ్యారు. కాగా డిప్యూటీ మేయర్గా పాల్వంచ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున విజయం సాధించిన సిరిపురపు లలితా కుమారి ఎన్నికయ్యారు. ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న పొత్తులో భాగంగా ఒక పార్టీకి మేయర్ పదవి, మరో పార్టీకి డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి. సీపీఐ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందంటూ కేటీఆర్ బహిరంగంగా చెప్పుకున్నా కామ్రేడ్లు దానికి అంగీకరించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీపీఐ, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కంటిన్యూ అయింది.


