epaper
Wednesday, February 18, 2026
epaper

నిజామాబాద్ డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌ (Nizamabad)లో ఎంఐఎం(AIMIM) వరుసగా మూడోసారి కింగ్ మేకర్‌గా నిలిచింది. ఆనవాయితీగా అధికార పార్టీకి మద్దతు ఇచ్చింది. గత రెండు సార్లు బీఆర్ఎస్ కు మద్దతు పలికి డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకుంది. ఈసారి కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరింది. దీంతో మేయర్ స్థానం కాంగ్రెస్ తీసుకోగా డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎం కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ ను ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖరారు చేశారు. సల్మా 54వ డివిజన్ నుంచి గెలుపొందారు. గత రెండు పర్యాయాలు నిజామాబాద్ లో ఎంఐఎంకు 16 సీట్లు వస్తే ఈసారి రెండు తగ్గి 14 మాత్రమే వచ్చాయి. 17 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఎంఐఎం సపోర్టుతో ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మేయర్, ఎంఐఎం డిప్యూటీ మేయర్ స్థానాలు కైవసం చేసుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>