కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad Mayor) మేయర్ గా ఉమారాణి పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. మంతనాలు, సమీకరణాల అనంతరం కరాటే రమేష్ దంపతులను ఈ పదవి వరించింది.. నిజామాబాద్‌లోని 49వ డివిజన్ నుంచి కూరగాయల ఉమారాణి గెలుపొందారు. నిజామాబాద్ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. మున్నూరు కాపు, గౌడ్, ముదిరాజ్ మూడు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు కాంగ్రెస్‌లో కార్పొరేటర్‌లుగా గెలిచిన వారిలో ఉన్నారు. రాజకీయ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈ పదవి లభించినట్టయింది. సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను పరిగణనలోకి తీసుకుని ఈసారి ముదిరాజ్ సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. గతంలో ఎక్కువసార్లు మున్నూరుకాపు సామాజికవర్గానికి మేయర్ పోస్టు దక్కడంతో ఈసారి ముదిరాజ్ నుంచి ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావించింది. పీసీసీ చీఫ్ ఈ జిల్లాకు చెందినవారు కావడం, ఆయన సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని మేయర్‌గా ప్రతిపాదిస్తే పార్టీలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ముదిరాజ్ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది.
ఉమా రాణి (Uma Rani) భర్త కరాటే రమేశ్ కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తే అన్ని రకాలుగా కలిసి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నీ తానై నిజామాబాద్ మేయర్ (Nizamabad Mayor) స్థానం హస్తం అకౌంట్‌లో పడేలా బాధ్యతలు భుజాన ఎత్తుకున్నారు.
Read Also: ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ‘టగ్ ఆఫ్ వార్’.. పై చేయి ఎవరిది?
Follow Us On: Sharechat


