కలం, వెబ్ డెస్క్: గుజరాత్ (Gujarat)లోని పలు స్కూళ్లకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఖలిస్తానీ ఉగ్రవాదులు పంపిన బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌తో అహ్మదాబాద్ (Ahmedabad), వడోదర (Vadodara)లోని అనేక విద్యాసంస్థల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూళ్లను ఖాళీ చేయించి, భద్రతా తనిఖీలు చేపట్టారు. మొత్తం అహ్మదాబాద్‌లో నాలుగు, వడోదరలో మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి.
పోలీస్ ఉన్నతాధికారులు ఆయా స్కూళ్లలో పరిశీలించి పరిస్థితిని సమగ్రంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. గతంలోనూ పలుమార్లు అహ్మదాబాద్‌లోని (Ahmedabad) అనేక స్కూళ్లకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇది ఫేక్ బెదిరింపుగా భావిస్తున్నారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై దర్యాప్తు చేపట్టారు.
Read Also: డ్రా పద్ధతిలో జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
Follow Us On: Sharechat


