epaper
Wednesday, February 18, 2026
epaper

పాక్‌కు చుక్కలు చూపుతున్న భారత బౌలర్లు

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు (Axar Patel). 5 ఓవర్లకే 4 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్ల దెబ్బకు 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది పాకిస్థాన్. పాక్​ క్రికెట్ కింగ్ అని చెప్పుకునే బాబర్ ఆజామ్‌ను అక్షర్​ పటేల్​ క్లీన్​ బౌల్డ్ చేశాడు. కేవలం 7 బంతులకు 5 పరుగులు చేసిన బాబర్ పెవిలియన్ చేరాడు. దీంతో పాక్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. అందరూ కూడా ఊపేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు పాకిస్థాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ ఒక్కడే డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. 16 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా కూడా సింగిల్ డిజిట్‌కే వెనుతిరిగారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా, పాండ్యా, అక్షర్​ పటేల్ (Axar Patel) చెరో వికెట్ తీశారు. దీంతో పాకిస్థాన్ 6 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది.

Read Also: మెరుస్తున్న భారత బౌలర్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>