epaper
Wednesday, February 18, 2026
epaper

స్పిన్ దెబ్బకు తడబడిన భారత్​.. పాక్ టార్గెట్​ 176

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్​ స్పిన్​ దెబ్బకు భారత్​ తడబడింది (Pakistan – India). దాయాది దేశంతో ఆదివారం కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. మ్యాచ్​లో పాక్ స్పిన్ మాయాజాలం పని చేసిందనే చెప్పుకోవాలి. భారత బ్యాటర్లు వారి స్పిన్​కు వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా భారత ఇన్నింగ్స్​ కొంచెం నత్తనడకనే సాగింది. భారత బ్యాటర్లు బౌండ్రీలతో విరుచుకుపడతారని, పాక్ స్పిన్నర్లకు చుక్కలు చూపిస్తారని కలలు కన్న అభిమానులకు నిరాశే మిగిలింది. దానికి తోడు హిట్టర్స్ అనిపించుకున్న వాళ్లలో ఇషాన్ మినహా మిగిలిన ఏ బ్యాటర్ కూడా ఆశించిన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేదు.

తొలుత అభిషేక్ శర్మ (Abhishek Sharma) డకౌట్‌తో మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్​లతో 77 పరుగులు చేశాడు. సైమ్ ఆయుబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ కొద్ది సేపటికే తిలక్ వర్మ్ 24 బంతుల్లో 25(2 ఫోర్లు, 1సిక్స్​) పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు.

ఆ తర్వాత క్రీజ్‌లోకి అడుగు పెట్టిన పాండ్యా గోల్డెక్ డకౌట్ అయ్యాడు (Pakistan – India). తొలి బంతికే బాది పారేద్దామన్నట్లు గాల్లోకి లేపగా అది కాస్తా క్యాచ్ అయింది. బాబర్ అజామ్ క్యాచ్‌తో పాండ్యా కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో శివమ్ దూబే స్టేడియంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలో రెండు వైపులా స్పిన్నర్లను దించడంతో భారత్​ స్కోరు నెమ్మదించింది. పాక్ మిస్టరీ స్పిన్నర్​ తారిఖ్​ వేసిన 19 ఓవర్​లో భారీ షాట్​ కొట్టబోయి సూర్య(32; 29 బంతుల్లో 3 ఫోర్లు) అవుటయ్యాడు. షాహిన్​ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్​ చివరి ఓవర్​లో రింకూ సింగ్​(11 నాటౌట్​; 4 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్​) రెండు ఫోర్లు, ఒక సిక్స్​ కొట్టడంతో భారత్​ స్కోరు 175కు చేరింది. అయితే, ఇదే ఓవర్​లో శివమ్​ దూబె, అక్షర్​ పటేల్​ వికెట్లను కోల్పోయింది.

పాక్ బౌలర్లలో సయీమ్​ అయూబ్​ 4 ఓవర్ల బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సల్మాన్ అఘా రెండు ఓవర్ల బౌలింగ్‌లో 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఉస్మాన్​ తారిఖ్​, షాహీన్ అఫ్రిది చెరో వికెట్​ తీసుకున్నారు. పాకిస్థాన్​ 176 పరుగులను భారత్​ టార్గెట్​గా పెట్టింది.

Read Also: ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్య? నటి తాప్సి వీడియో వైరల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>