కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రం నుంచి మిగిలి ఉన్న మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. 15 మంది మావోయిస్టు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాతో పాటు పునరావాస పథకం కింద తక్షణ సాయం, ప్రయోజనాలు అందుతాయని సూచించారు. దీని ద్వారా మావోయిస్టులు వారివారి సొంతూర్లలో కుటుంబాలతో స్వేచ్ఛ, గౌరవంగా జీవించగలుగుతారని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల్లో తెలంగాణ పోలీసుల ప్రయత్నాల ద్వారా వివిధ స్థాయిల్లోని 588 మంది మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు లొంగిపోయి తమ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస కార్యక్రమాల విశ్వసనీయతకు నిదర్శనమని డీజీపీ వెల్లడించారు.
Read Also: 3 సూత్రాలు.. 7 చక్రాలు : రేపటి నుంచి ఏఐ సమ్మిట్
Follow Us On: Sharechat


