epaper
Wednesday, February 18, 2026
epaper

కరీంనగర్​ టు హైదరాబాద్​ : క్యాంపు రాజకీయం

కలం, వెబ్​ డెస్క్​ : కరీంనగర్ కార్పొరేషన్ (Karimnagar Corporation) ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీలు తమ కార్పొరేటర్లను హైదరాబాద్‌లోని వేర్వేరు క్యాంప్‌ లకు (Camp Politics) తరలించాయి.

కాంగ్రెస్ పార్టీ నగర శివారులోని లియోనియా రిసార్ట్‌ను తమ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంది. కరీంనగర్ కార్పొరేటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంప్‌ను పర్యవేక్షించేందుకు పార్టీ కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు రిసార్ట్‌కు చేరుకోగా, తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి చేరుకున్నారు.

మరోవైపు బీజేపీ కూడా తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు రహస్యంగా క్యాంప్‌ (Camp Politics) లను నిర్వహిస్తున్నది. మేయర్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో ఇండిపెండెంట్​ లను సైతం తమవైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో కరీంనగర్ స్థానిక రాజకీయం ఇప్పుడు హైదరాబాద్ రిసార్టుల చుట్టూ తిరుగుతోంది.

Read Also: సీఎం రేవంత్​పై రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>