కలం, వెబ్‌డెస్క్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేడుకకు భారత్ సిద్ధమైంది (AI Impact Summit 2026). టెక్నాలజీ యుగంలో అత్యంత కీలక ఆవిష్కరణగా భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్ రేపటి నుంచే ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సోమవారం ప్రారంభించనున్నారు. భారత్ మండపంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ప్రపంచంపై కృత్రిమ మేధ చూపుతున్న ప్రభావం, భవిష్యత్ సవాళ్లు, ఆవిష్కరణలు తదితర వాటిపై ఈ సమ్మిట్ చర్చించనుంది. దీనికి దాదాపు 50 దేశాల నుంచి మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. అలాగే గూగుల్, ఓపెన్ ఏఐ, ఎన్విడియా తదితర టెక్ జెయింట్స్ ఫౌండర్లు, సీఈవోలు రానున్నారు. స్టార్టప్స్, అకడమికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వాములు పాల్గొననున్నారు.
పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్..
సమ్మిట్ కోసం 70వేల చ.కి.మీ వైశాల్యంలో 10 ఎరీనాలు ఏర్పాటుచేశారు. అలాగే 13 కంట్రీ పెవిలియన్స్ అందుబాటులోకి తెచ్చారు. వీటిలో ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్తోనియా, తజకిస్థాన్, ఆఫ్రికా పెవిలియన్స్ ఉంటాయి.
ఏఐ సమ్మిట్‌ను పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ మూడు సూత్రాల ఆధారంగా నిర్వహిస్తారు. హ్యూమన్ క్యాపిటల్, ఇల్యూషన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్, సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ, సైన్స్, రెజిలెన్స్–ఇన్నోవేషన్స్–ఎఫిషియన్సీ, డెమోక్రసీ ఏఐ రీసోర్సెస్, ఏఐ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ అండ్ సోషియల్ గుడ్ అనే ఏడు చక్రాలుగా ఏఐని విభజించారు. వీటికి సంబంధించిన ఆవిష్కరణలు, ఆలోచనలు, భవిష్యత్ కార్యక్రమాలను పంచుకుంటారు.
మొత్తం 500కు పైగా సెషన్స్ నిర్వహిస్తారు. 3,250 మంది ప్రముఖులు, నిపుణులు మాట్లాడతారు. సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి 2.5లక్షల మందికిపైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని వివిధ స్టార్ హోటల్స్‌లో రూమ్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. ఈ కార్యక్రమం (AI Impact Summit 2026) ద్వారా భారత్ అంతర్జాతీయ స్థాయిలో ఏఐకి హబ్‌గా మారుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.
Read Also: వారమే గడువు.. పాక్ సైన్యానికి బీఎల్ఏ వార్నింగ్
Follow Us On: X(Twitter)


