epaper
Wednesday, February 18, 2026
epaper

బంగ్లాదేశ్​కు స్పీకర్​ ఓం బిర్లా

కలం, వెబ్​డెస్క్​: లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా (Speaker Om Birla) బంగ్లాదేశ్​కు వెళ్లనున్నారు. ఈ నెల 17న బంగ్లాదేశ్​ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న తారిఖ్​ రహ్మాన్ (Tarique Rahman)​ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ వేడుకకు రమ్మని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్​ నేషనలిస్ట్​ పార్టీ (బీఎన్​పీ) ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. అయితే, పీఎం మోదీకి బదులు స్పీకర్​ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి మిస్రీ వెళతారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు పర్చడంలో స్పీకర్​ ఓం బిర్లా పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపింది.

కాగా, గత గురువారం బంగ్లాదేశ్​ (Bangladesh) పార్లమెంట్​కు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 297 స్థానాలకు గాను 212 గెలిచి బీఎన్​పీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, బంగ్లా దివంగత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్​ రహ్మాన్ ఈ నెల 17 ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది. దీనికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపినప్పటికీ ఈ నెల 16 నుంచి 19 వరకు ఢిల్లీలో గ్లోబల్​ ఏఐ ఇంపాక్ట్​ సమ్మిట్​ జరగనున్న దృష్టా ఆయన బదులు స్పీకర్​ను (Speaker Om Birla) పంపేందుకు భారత్​ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏడాదిన్నర కిందట విద్యార్థుల ఆందోళన కారణంగా అప్పటి బంగ్లాదేశ్​ ప్రధాని, అవామీ లీగ్​ పార్టీ అధినేత్రి షేక్​ హసీనా పదవిని వదిలేసి, భారత్​తో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్​లో మహ్మద్​ యూనస్​ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడి హిందువులపై దాడులు, హత్యలు జరిగాయి. బంగ్లాదేశ్​ సైతం క్రమక్రమంగా పాకిస్థాన్​తో సంబంధాలు పెంచుకుంటోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో రెండు దేశాల మధ్య తిరిగి సత్సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

Read Also: 3 సూత్రాలు.. 7 చక్రాలు : రేపటి నుంచి ఏఐ సమ్మిట్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>