తెలంగాణ సుభిక్షంగా ఉండాలి : మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని శివుడిని కోరుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి తన కుటుంబంతో కలిసి జిల్లాలోని శైవ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. మొదటగా సొంత నియోజకవర్గం పాలేరులోని తీర్థాల సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కూసుమంచిలోని శ్రీ గణపేశ్వర స్వామి ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా అశ్వారావుపేట నియోజక వర్గం చంద్రుగొండ మండలం బెండాలపాడులోని పల్లెర్ల బావి శ్రీ వీరభద్ర స్వామి వారిని మంత్రి దంపతులు దర్శించుకున్నారు.

Read Also: కరీంనగర్​ టు హైదరాబాద్​ : క్యాంపు రాజకీయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>