epaper
Wednesday, February 18, 2026
epaper

ఎన్నిక‌ల్లో ఓడిపోయా.. డ‌బ్బు, చీర‌లు తిరిగిచ్చేయండి!

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్ర‌ంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు (Municipal Elections) జ‌రిగే వ‌ర‌కు ఒక లెక్క‌.. అయిపోయాక ఒక లెక్క అన్న‌ట్లు త‌యారైంది ప‌రిస్థితి. ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం అభ్య‌ర్థులు డ‌బ్బులు ఇవ్వ‌డం, గిఫ్ట్‌లు పంచ‌డం మామూలే. కానీ ఓడిపోయిన అభ్య‌ర్థులు వాళ్లు పంచిన వాటిని వెన‌క్కి అడ‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది.

తాజాగా ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు, హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని ఓ కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) తాను పోటి చేసిన వార్డులో హ‌ల్చ‌ల్ చేశారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) మున్సిపాలిటీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన స్వ‌రూప రాణి ఓడిపోయింది. అయితే ఆమె ఎన్నిక‌లప్పుడు ఓట‌ర్ల‌కు డబ్బులు, చీరలు, హాట్ బాక్స్‌లు పంచింది. ఇక ఇవ‌న్నీ తిరిగివ్వాల‌ని బంధువుల‌తో క‌లిసి ఓటర్ల ఇళ్లకు వెళ్లింది.

కొంద‌రు గిఫ్ట్‌లు తీసుకొచ్చి ఇవ్వ‌గా మ‌రికొంద‌రు ఓట‌ర్లు స్వ‌రూప‌పై తిర‌గ‌బ‌డ్డారు. ఓటు వేసినా మ‌ళ్లీ వెన‌క్కి ఇవ్వ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. అంద‌రూ మూకుమ్మ‌డిగా ఎదురించ‌డంతో స్వరూప, బంధువులు వెన‌క్కి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read Also: మాంచెస్టర్ సిటీ ఆట నచ్చట్లేదన్న కోచ్..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>