కలం, డెస్క్ : రాజమౌళి (Rajamouli) ఎప్పుడైనా తన సినిమాలకు ఒక ప్రాసెస్ ను ఫాలో అవుతూ ఉంటాడు. యుద్ధానికి ముందు ఎంత సన్నద్ధం అయితే అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది జక్కన్న నమ్మకం. అందుకే తన ప్రతి సినిమాకు ఎక్కువ రిహార్సల్స్ చేయించడం జక్కన్న తప్పనిసరిగా ఫాలో అవుతున్నాడు. బాహుబలి నుంచే రిహార్సల్స్ చేయించడం మొదలుపెట్టాడు. జక్కన్న సీన్లకు ముందు నటీనటులను ఎంతగా ప్రాక్టీస్ చేయిస్తాడు అనేది గతంలో చాలామంది చెప్పారు. ఒక్క టేక్ లోనే డైలాగ్ చెప్పేయగలడు అనే పేరున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా జక్కన్న పెట్టే కష్టం గురించి చాలా సార్లు చెప్పారు. రామ్ చరణ్, ప్రభాస్ తో పాటు సీనియర్ నటులు ఆయన రమ్యకృష్ణ, నాజర్, ప్రకాష్ రాజ్ లాంటి వారికి కూడా రిహార్సల్స్ తప్పలేదు.
ఇప్పుడు వారణాసి మూవీకి కూడా అంతకు మించిన రిహార్సల్స్ చేస్తున్నాడు రాజమౌళి (Rajamouli). హాలీవుడ్ రేంజ్ లో వారణాసిని మొదటి నుంచి ప్రమోట్ చేస్తున్నాడు జక్కన్న. పాన్ ఇండియా సినిమాలకే ఒక రేంజ్ లో రిహార్సల్స్ చేయించే రాజమౌళి.. ఇక పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న వారణాసికి ఏ స్థాయిలో చేయిస్తాడు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి చేయించే రిహార్సల్స్ చాలా కఠినంగా ఉంటాయని.. బెస్ట్ అవుట్ పుట్ రావడానికి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది. మహేష్ బాబు కూడా వారణాసి లోని ప్రతి సీన్ కు ముందు రాజమౌళి చేయించే రిహార్సల్స్ తమను చాలానే కష్టపెడుతాయని.. కానీ జక్కన్నకు ఓకే అనిపించేదాకా కష్టపడటం తమకు చాలా ఇష్టంగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఒక సీన్ అద్భుతంగా రావడానికి ఎంత కష్టపడాలి అనేది రిహార్సల్స్ లోనే తెలుస్తోందని మహేష్ బాబు చెప్పడం ఆసక్తికరంగా మారింది. హాలీవుడ్ లో పనిచేసిన ప్రియాంకను కూడా జక్కన్న రిహార్సల్స్ చేయించడం అంటే.. వారణాసికి ఎలాంటి సీన్లు ప్లాన్ చేస్తున్నాడో అని అప్పుడే మహేష్ బాబు ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు.
అయితే ఇలా రిహార్సల్స్ చేయించడం వెనక జక్కన్నకు ఒక సీక్రెట్ ఉంది. ప్రేక్షకులు తన సినిమాలపై పెట్టుకునే అంచనాలకు మించి రిజల్ట్ ఉండాలి అనేది జక్కన్న ప్లాన్. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ మేనియా నడుస్తోంది కాబట్టి.. దానికి తగ్గట్టు ముందే ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది జక్కన్న అంచనా. బాహుబలి సినిమానుంచే జక్కన్న తన సినిమాల్లో ఎక్కువగా విఎఫ్ఎక్స్ వాడుతున్నాడు. అందుకే ఆ సినిమా నుంచే రిహార్సల్స్ కఠినంగా చేయిస్తూ.. ప్రతి సీన్ లో రియాలిటీని చూపించేందుకే ప్రయత్నిస్తున్నాడు. ఆర్టిస్టులకు డైలాగ్ పేపర్లు ఇచ్చి.. రకరకాల యాంగిల్స్ లో కెమెరాలు పెట్టి షూట్ చేయిస్తూ ఉంటాడు. ఏ యాంగిల్ లో ఆ సీన్ బాగుంటే ఆ యాంగిల్ లోనే షూట్ చేసేస్తారు. దీనివల్ల నిర్మాతలపై పెద్దగా భారం పడదు. పైగా రీ షూట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జక్కన్న తనకు కావలసిన పర్ఫార్మెన్స్ ను కూడా ఆర్టిస్టుల నుంచి రాబట్టగలుగుతాడు. మరి మొదటిసారి పాన్ వరల్డ్ రేంజ్ లో వారణాసి మూవీని తీసుకొస్తున్నాడు కాబట్టి.. అంతకు మించిన స్థాయిలోనే రిహార్సల్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్డే.. రామ్చరణ్ స్పెషల్ పోస్ట్
Follow Us On: Youtube


