కలం, డెస్క్ : హైదరాబాద్ లో (Hyderabad) మరో దారుణం జరిగింది. కుషాయిగూడలో ఇదరు యువకులు తమ వెహికల్ కు పోలీసు సైరన్ పెట్టుకుని.. ఓ కారును ఢీ కొట్టారు. అనంతరం ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఢీకొట్టి కిలోమీటర్ దాకా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సతీష్ (45) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి ఈ నెల 9న రాత్రి బంజారాహిల్స్ లోని ఆఫీస్ నుంచి రాంపల్లిలోని తన ఇంటికి కారులో బయలుదేరారు. హెచ్ బీ కాలనీలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరకు సతీష్ కారు రాగానే.. వెనక నుంచి బొలెరో వాహనం పోలీసు సైరన్ పెట్టుకుని వచ్చి ఢీ కొట్టింది. దీంతో సతీష్ కారు దిగి వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఢీ కొట్టి కిలోమీటర్ దాకా బొలెరో మీదనే ఈడ్చెకెళ్లారు యువకులు. ఈ ఘటనలో సతీష్ కు తీవ్ర గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు ఉప్పరి మహేశ్ (23), తరుణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ పెయింటర్లుగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఇలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.


