కలం, డెస్క్ : పుల్వామా అమరుల కుటుంబాలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) అన్నారు. సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారని.. తన స్కూల్ లో వారి పిల్లలు చదవడం ఒక బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు సెహ్వాగ్. ‘ఈ పిల్లలను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. వారి తండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. పిల్లల చదువు బాధ్యత పూర్తిగా నాదే. ఎన్నటికైనా పిల్లలను మంచి పొజీషన్ లో చూస్తే అప్పుడే నా బాధ్యత నెరవేరుతుంది’ అంటూ తెలిపాడు సెహ్వాగ్ (Sehwag). ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఆరేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా దేశమంతా వారికి నివాళి అర్పిస్తోంది.


