కలం, వెబ్‌డెస్క్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి (MA Baby) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. సర్ (Special Intensive Revision – SIR) ప్రక్రియ చట్టపరమైన విధానాలకు, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు.
ఎలక్షన్స్‌కు కేవలం కొన్ని నెలల ముందు, తక్కువ సమయంలో విస్తృతంగా ఓటర్ల సవరణ చేయడం వల్ల ఎన్నికల వాతావరణం దెబ్బతినే అవకాశముందన్నారు. ఈ ప్రక్రియలో పొరపాట్లు జరిగే ప్రమాదం పెరుగుతుందని, అన్యాయంగా ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించారు.
‘ కాలానికి తగినట్లు ఓటర్ల జాబితాను సవరించడం సాధారణ, ప్రజాస్వామ్యపరంగా అవసరమైన ప్రక్రియే అని అంగీకరిస్తున్నాం. అయితే, ప్రస్తుతం ‘సర్’ చేపట్టిన విధానం, సమయం, అమలు పద్ధతి మాత్రం సరిగా లేదు. ఇది చట్టపరమైన విధానాలు, గత సంప్రదాయాలు, రాజ్యాంగ సూత్రాలకు స్పష్టంగా విరుద్ధంగా ఉంది’ అని లేఖలో ఎం.ఎ.బేబి (MA Baby) పేర్కొన్నారు.
Read Also: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్.. ఐదు రోజులైనా!
Follow Us On : WhatsApp


