epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపల్ పోరుపై కేటీఆర్ చిట్‌చాట్.. కాంగ్రెస్, బీజేపీపై ఫైర్

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  నిర్వహించిన చిట్‌చాట్‌లో కాంగ్రెస్, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై (Municipal Election Results) కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉందని, ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడమే అందుకు కారణమన్నారు. తాము గెలిచిన మున్సిపాలిటీలతోపాటు, హంగ్ ఏర్పడిన చోట్ల కూడా బీఆర్ఎస్‌కే స్పష్టమైన విజయావకాశాలు ఉన్నాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ అభ్యర్థుల ప్రదర్శన బాగుందని బీజేపీ నేతలు అనవసరంగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

కేటీఆర్ (KTR) గత ఎన్నికల విజయాలను ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) విమర్శించారు.  రేవంత్ రెడ్డి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సాధించిన ఫలితాలేమిటి? నేడు మేం సాధించిన స్థానాలెన్ని? అని ప్రశ్నించారు. తమ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదని కేటీఆర్ అన్నారు.

 Read Also: కొత్త బాస్ సింగరేణిని గాడిలో పెడతారా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>