epaper
Wednesday, February 18, 2026
epaper

నేటి నుంచి తీర్థాల జాతర

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) రూరల్ మండలంలోని తీర్దాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా శనివారం నుంచి బుధవారం వరకు జాతర (Theerthala Jatara) జరగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ మహా శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా తీర్థాలలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 10 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది.

మహాశివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామంలో ఉన్న సంగమేశ్వర స్వామి (Sangameshwara Swamy) దేవాలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది. గతం కంటే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా అవసరమైన మేర బస్సుల సంఖ్య పెంచారు. రద్దీగా ఉండే రూట్లలో అదనంగా బస్సులు నడుపుతున్నారు. దేవస్థానం వద్ద క్యూలైన్లు ఏర్పాటు, స్నాన ఘట్టాల వద్ద రెస్క్యూ బృందాల ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ ద్వారా భక్తులకు తాగునీటి వసతి కల్పించారు.

జాతర (Theerthala Jatara) సందర్భంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి వైద్య శిబిరంలో వైద్యాధికారులు పారామెడికల్ సిబ్బందితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో అందుబాటులో ఉంచారు. రెండు 108 వాహనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. ఫైర్ ఇంజన్లను కూడా అందుబాటులో ఉంచారు. అన్ని శాఖల అధికారులతో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతో పాటు తప్పిపోయిన, భక్తులకు సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు.

 Read Also: ఏలేశ్వర స్వామి భక్తులకు శుభవార్త.. దర్శనానికి లాంచీ సేవలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>