కలం, వెబ్ డెస్క్: ముంబయి (Mumbai)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ములుంద్ వెస్ట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో పిల్లర్ (Metro Pillar) కుప్పకూలిపోయింది. మెట్రో పిల్లర్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఓ కారు, ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకొని ఉన్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో మెట్రో నిర్మాణ పనుల్లో నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అత్తాపూర్‌లో దారుణం.. బావను చంపిన బావమరుదులు
Follow Us On: Instagram


