కలం, సంగారెడ్డి బ్యూరో: జోగిపేట (Jogipet) పట్టణంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వచ్చిన డబ్బులను దాచుకుంటే ఎవరో కొట్టేశారనే మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కేశాడు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీల వాళ్లు ఓటర్లకు డబ్బులు పంచారు. ఈ క్రమంలో జోగిపేటకు చెందిన మార్కల అశోక్ తనకు వచ్చిన డబ్బును దాచుకున్నాడు. ఇలా ఓటుకు వచ్చిన పైసలతో సెల్ ఫోన్ కొనుక్కోవాలని అనుకున్నాడు. అయితే తాను దాచుకున్న డబ్బులు ఎవరో దొంగిలించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. డబ్బులు లేకపోవడంతో సెల్ కొనలేనని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సెల్ టవర్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు తాము డబ్బులిచ్చి సెల్ ఫోన్ కొనిస్తామని హామీ ఇవ్వడంతో సెల్ టవర్ పై నుంచి అశోక్ కిందికి దిగాడు.
Read Also: పరకాల మున్సిపాలిటీలో 11మంది మహిళా కౌన్సిలర్లు
Follow Us On : WhatsApp


