పరకాల మున్సిపాలిటీలో 11మంది మహిళా కౌన్సిలర్లు

కలం, వరంగల్ బ్యూరో : పరకాల మున్సిపాలిటీ (Parakala Municipality) పరిధిలో మహిళలు సరికొత్త చరిత్ర సృష్టించారు. మొత్తం 22 వార్డులకు గాను ఏకంగా 11 వార్డుల్లో మహిళా కౌన్సిలర్లు విజయం సాధించి పాలనలో సగం భాగస్వామ్యాన్ని దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా 2, 3, 4, 5, 6, 10, 12, 13, 14, 17, 18 వార్డుల నుండి మహిళలు ప్రజాప్రతినిధులుగా (Women Councillors) ఎన్నికై రికార్డు నెలకొల్పారు.

మిగిలిన 11 వార్డులలో పురుషులు విజయం సాధించగా, సరిగ్గా సగం స్థానాల్లో మహిళలు గెలవడం ద్వారా స్థానిక రాజకీయాల్లో వారి ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరకాల మున్సిపాలిటీ (Parakala Municipality) అభివృద్ధిలో మహిళా కౌన్సిలర్ల భాగస్వామ్యం పెరగడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారతకు ఈ విజయం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు.

 Read Also: సంగారెడ్డిలో చింతే మిగిలింది..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>