కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. కౌంటంగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఓ బీఆర్ఎస్ అభ్యర్థి (BRS Candidate) ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మున్సిపాలిటీలోని 54వ డివిజన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మ పోటీ చేశారు. శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో తనకు సంబంధించిన 100 ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కించలేదని పద్మ ఆరోపిస్తున్నారు. దీనిపై పలుమార్లు ప్రశ్నించినా పట్టించుకోలేదన్నారు. రీకౌంటింగ్ చేయాలని ఎన్నిసార్లు కోరినా వినకుండా తనతో సంతకం పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వోకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై పద్మ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని, తనకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో పద్మ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.


