epaper
Wednesday, February 18, 2026
epaper

నా టార్గెట్ CM సీట్.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్

కలం, నల్లగొండ బ్యూరో : మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని..  ఆ పదవి మీకోసం వస్తుంది.. నా కోసం కాదంటూ మునుగోడు ప్రజలనుద్దేశించి అన్నారు. మంత్రి కాకపోతే.. డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా.. ఇందులో భయపడేది ఏమీలేదని స్పష్టం చేశారు.

‘ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రిని చేస్తారా చేయండి. లేదంటే.. నా టార్గెట్ డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవే. మునుగోడును (Munugode) మీరు చూసుకోండి.. తెలంగాణను నేను చూసుకుంటా. నాకు అడుక్కోవడం రాదు’ అంటూ హైకమాండ్​ కు రాజగోపాల్​ రెడ్డి వార్నింగ్​ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణ మీద జెండా ఎగరేసి చూపిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ప్రకటించారు. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి సీఎం అంటూ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి.

Read Also: పట్టణ ఓటర్లూ కాంగ్రెస్ వైపే.. సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>