epaper
Wednesday, February 18, 2026
epaper

తూప్రాన్‌లో టెన్షన్ టెన్షన్.. క్యాంపు తరలింపులో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఘర్షణ

కలం, మెదక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జోరుగా క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ మున్సిపల్ (Toopran Municipality) పరిధిలోని 6వ వార్డులో గెలుపొందిన కొక్కొండ సమత కాశీరెడ్డి క్యాంపునకు తరలించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర ప్రయత్నం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన సమత కాశీరెడ్డిని కాంగ్రెస్ నాయకులు క్యాంపునకు తరలించే ప్రయత్నం చేశారు.

విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ (BRS) నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ‘మా క్యాంపునకు రావాల్సిందే’ అంటూ గొడవకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు సమత కాశీరెడ్డిని బీఆర్ఎస్ క్యాంపునకు తరలించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూప్రాన్ మున్సిపాలిటీలో (Toopran Municipality) మొత్తం 16 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 3 వార్డులు గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ 8 కావడంతో కౌన్సిలర్లను కాపాడుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి.

Read Also: నిజామాబాద్ లో హంగ్.. మేయర్​ సీటుపై ఉత్కంఠ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>