epaper
Wednesday, February 18, 2026
epaper

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎన్నికల డ్యూటీ ముగించుకుని నకిరేకల్ వెళ్తుండగా.. నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామ శివారులో రాగానే కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుల్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మునుగోడు (Munugodu) పోలీస్ స్టేషన్లో విధులు  నిర్వహిస్తున్న కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్(34) నల్గొండలో ఎన్నికల కౌంటింగ్ వద్ద విధులు నిర్వహించారు.

శుక్రవారం తిరిగి స్వగ్రామం నకిరేకల్‌కు బైక్‌పై వెళుతుండగా.. ఎదురుగా వచ్చిన డీసీఎం, కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్‌(Shaik Tayyub) ను ఢీకొట్టింది. దీంతో తయ్యుబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడిపి ఎదురుగా వస్తున్న కానిస్టేబుల్‌ని ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ తయ్యుబ్‌ కుటుంబానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>