కలం, వరంగల్ బ్యూరో: జనగామ మున్సిపాలిటీ (Jangaon Municipality) చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 30 వార్డులకు అధికార కాంగ్రెస్ 13 (సిపిఎం 1), బీఆర్ఎస్ 13, నలుగురు స్వతంత్రులు విజయం సాధించారు. చైర్మన్ పీఠం కోసం స్వతంత్రులు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో 23వ వార్డు అభ్యర్థిని బీఆర్ఎస్ నేతలు క్యాంప్‌కు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్(BRS) నేతలను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో ఎంపీ చామల వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Read Also: ప్రజా పాలనకు బ్రహ్మరథం : టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
Follow Us On: Instagram


