epaper
Wednesday, February 18, 2026
epaper

అభిషేక్‌ శర్మ అంతా గుడ్డి కొట్టుడే: పాక్ ప్లేయర్

కలం, స్పోర్ట్స్:  అభిషేక్ శర్మకు (Abhishek Sharma) అసలు ఆడటం వచ్చా? అంతా గుడ్డిగా కళ్లు మూసుకుని కొట్టడమేగా.. అంటూ పాక్ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌లో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న హైఓల్టేజ్ పోరుకు ముందు మైదానం వెలుపల మాటల యుద్ధం మొదలైంది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరుపై పాకిస్థాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ (Mohammad Amir) విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమీర్, అభిషేక్ శర్మను తక్కువ చేసి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

అభిషేక్ శర్మ ఆటలో ఎలాంటి నైపుణ్యం లేదని, అతను కేవలం అదృష్టం కొద్దీ పరుగులు చేస్తున్నాడని అమీర్ వ్యాఖ్యానించారు. అభిషేక్ ఒక “స్లాగర్” (బాదుడుగాడు) అని, ప్రతి బంతిని బలంగా బాదడానికే ప్రయత్నిస్తాడని అభిప్రాయపడ్డారు. అతని రోజు బాగుంటేనే పరుగులు వస్తాయని, లేదంటే విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అభిషేక్ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఒకసారి మాత్రమే స్కోరు చేస్తాడని, మిగిలిన సమయాల్లో అతని స్కోర్లు చాలా తక్కువగా ఉంటున్నాయని గణాంకాలను ప్రస్తావించారు.

టెక్నికల్‌గా అభిషేక్ (Abhishek Sharma) పటిష్టమైన బ్యాటర్ కాదని అమీర్ విశ్లేషించారు. అతను ఒకే చోట నిలబడి అన్ని బంతులు తను కోరుకున్న చోటే పడాలని ఆశిస్తాడని, ఇది చాలా రిస్క్‌తో కూడిన ఆట అని పేర్కొన్నారు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు కూడా భారీ షాట్లు ఆడితేనే అతడిని సరైన బ్యాటర్ అని భావిస్తానని అమీర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య వేడిని పెంచాయి. మ్యాచ్ ఫలితం తర్వాత ఈ విమర్శలకు ఎలాంటి సమాధానం లభిస్తుందో చూడాలి.

Read Also: ఇషాన్ సెంచరీ పక్కా అనుకున్నా: ఆకాష్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>