ఉత్కంఠభరితంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలు

కలం, వెబ్​ డెస్క్​ : నిజామాబాద్ (Nizamabad Corporation) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో ఫలితాల సరళిపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ మూడు పార్టీలు కూడా విజయం కోసం నువ్వా నేనా అన్నట్లుగా దూసుకుపోతున్నాయి.

ప్రస్తుత గణాంకాల ప్రకారం బీజేపీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ పార్టీ 19 స్థానాల్లో లీడ్ సాధించడమే కాకుండా 3 స్థానాల్లో విజయం సాధించింది. ఈ కార్పొరేషన్ పై బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్, ఎంఐఎం కూడా గట్టి పోటీని ఇస్తూ సమీపంలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 2 స్థానాల్లో తన గెలుపును ఖాయం చేసుకుంది. అదేవిధంగా ఎంఐఎం 8 స్థానాల్లో లీడ్ సాధించి 2 స్థానాల్లో విజయం సాధించింది.

ప్రస్తుతానికి బీజేపీ అధిక స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ గెలిచిన స్థానాల పరంగా మూడు పార్టీల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా కనిపిస్తోంది. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందనే అంశంపై ప్రజల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మారుతుండటంతో నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>