కలం, వరంగల్ బ్యూరో : వర్దన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (Aroori Ramesh) ను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. పోలీసులను తోసుకుంటై కౌంటింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వరంగల్, ఖమ్మం హైవే పై పార్టీ శ్రేణులతో కలిసి ఆరూరి ధర్నాకు దిగారు.
మున్సిపాలిటీ (Wardhannapet Municipality) ఎన్నికల్లో 12 వ వార్డు కు చెందిన తమ అభ్యర్థి గెలిచినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి నిర్ణయాన్ని అయన తప్పుబట్టారు. వెంటనే అధికారిని సస్పెండ్ చేసి 12 వ వార్డు ఫలితాన్ని తెల్చేందుకు రీ కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో శాంతిభద్రతలను కాపాడేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరూరి రమేశ్ ను (Aroori Ramesh) అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన విరమించారు.
Read Also: దెబ్బకు దెబ్బ కొట్టిన నవీన్ యాదవ్
Follow Us On: Sharechat


