కలం, వెబ్ డెస్క్ : కోవా బన్ విక్రయించే ఒక చిరు వ్యాపారి జీవితాన్ని రోడ్డుపైకి లాగడం దారుణమని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఆ వ్యాపారికి మద్దతు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. ఆకలికి కులం ఉండదని, అలాగే ఆత్మగౌరవానికి మతం ఉండదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన గుర్తుచేశారు.
యూట్యూబ్‌లో కేవలం వ్యూస్, లైక్స్ సంపాదించడం కోసమే కొంతమంది ఇలాంటి అమానవీయ పనులకు ఒడిగడుతున్నారని శ్రీరామ్ (Paritala Sriram) విమర్శించారు. వీలైతే పేదవారికి అండగా నిలబడాలి తప్ప, వారి గొంతు నొక్కడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. సదరు వ్యాపారికి అండగా నిలుస్తూ ఈ ఘటనను ఖండిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో ఆ చిరు వ్యాపారికి లభిస్తున్న మద్దతు చూస్తుంటే మానవత్వం ఇంకా బతికే ఉందన్న నమ్మకం కలుగుతోందని పరిటాల శ్రీరామ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Also: జనసేన అభ్యర్థికి ఒక్క ఓటే.. కథ తెలిస్తే కామెడీ!
Follow Us On: Youtube


