కలం మెదక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ (BRS) జోరు కనబరుస్తోంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల (Gummadidala) మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గుమ్మడిదల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా 14 వార్డులు బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. మరోవార్డులో ఫలితం రావాల్సి ఉంది.
మరోవైపు ఇంద్రేశం (Indresham) మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 18 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 9, బీజేపీ 2, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 గెలిచారు. చైర్మన్ పదవికి మ్యాజిక్ ఫిగర్ 9 కావడంతో బీఆర్ఎస్ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.


