కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ(TDP) బోణీ కొట్టింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇలాకాలో టీడీపీ జెండా ఎగిరింది. మధిర(Madhira) మున్సిపాలిటీలోని 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి గెలుపొందారు. రేవతి గెలుపుతో స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


