కలం, డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి టెస్టిట్యూబ్ బేబీ సెంటర్ కేసులో (Srushti Case) ఈడీ దూకుడు పెంచింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతను తాజాగా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో అక్రమాలు చేసినట్టు నిర్ధారణ కావడంతో నమ్రతతో పాటు ఆమె కొడుకును ఈడీ అదుపులోకి తీసుకుంది. సంతానం లేని దంపతుల నుంచి హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. సంతానం లేని దంపతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని.. కర్ణాటక, మహారాష్ట్ర, ఒఢిశాలోని గిరిజనుల పిల్లలను కొనుగోలు చేసినట్టు అధికారలు విచారణలో నమ్రత ఒప్పుకున్నారు. ఆ పిల్లలను తమ వద్దకు వచ్చే దంపతులకు ఇచ్చినట్టు కూడా నమ్రత విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం.
Read Also: ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. ఇక రోడ్లపైనే కాదు, ఆకాశంలోనూ షికారే!
Follow Us On: X(Twitter)


